Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్

Vizianagaram : అమ్మాయికి వయసు సరిపోదని గుర్తించిన తల్లి.. బాలిక శరీరంలో మార్పులు రావాలని భావించింది. శరీర భాగాలు త్వరగా పెరగాలని ఇంజెక్షన్లు..

Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్

Vizianagaram

Vizianagaram – Hormone Injections : కూతురిని హీరోయిన్ చేయాలని బలవంతంగా ఆమెకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చిన కేసులో కసాయి తల్లిని అరెస్ట్ చేశారు విజయనగరం పోలీసులు. ఆమెపై కేసు నమోదు చేసి దిశ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. హీరోయిన్ చేయాలని కన్న కూతురికి రోజూ ఇంజెక్షన్లు వేయించింది మహిళ. వద్దని ఎంత వేడుకున్నా వినలేదని కూతురు వాపోయింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సహకారంతో బాలికను స్వాధార్ హోమ్ కు తరలించారు.

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ మహిళకు కూతురు ఉంది. తన మైనర్ కూతురిని హీరోయిన్ చేయాలని తల్లి అనుకుంది. కానీ, ఆ అమ్మాయికి వయసు సరిపోదని గుర్తించిన తల్లి.. బాలిక శరీరంలో మార్పులు రావాలని భావించింది. శరీర భాగాలు పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వాలని నిర్ణయిచింది.(Vizianagaram)

అంతే, కన్న కూతురి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంజెక్షన్ల ద్వారా ఆమె శరీరంలో మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేసింది. ఆ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వాడినప్పటి నుంచి కూతురు అనారోగ్యం పాలైంది. వద్దని ఎంత చెప్పినా తన తల్లి వినేది కాదని, తానే తప్పు చేస్తున్నట్లుగా అరిచేదని బాధిత బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతకూ వినకపోవడంతో బాధ భరించలేక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసింది. వారు పోలీసుల సహకారంతో బాలికను కసాయి తల్లి చెర నుంచి విడిపించారు. బాలికను హోమ్ కు తరలించారు.

ఏ తల్లి అయినా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. బిడ్డకు చిన్న కష్టం వచ్చినా తల్లి తట్టుకోలేదు. ఆమె మనసు విలవిలలాడుతుంది. వారికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకుంటుంది. కానీ, ఆ తల్లి మాత్రం కసాయిలా వ్యవహరించింది. కన్నకూతురి పట్ల అమానుషంగా వ్యవహరించింది. ఏ తల్లి చేయని పాడు పని చేసింది. కూతురిని హీరోయిన్ చేయాలనుకున్న ఆ కసాయి తల్లి అడ్డదారులు తొక్కింది. బిడ్డ శరీర భాగాలు త్వరగా పెరగాలని ఆమెకు రకరకాల హార్మోన్ ఇంజక్షన్లు బలవంతంగా ఇప్పించింది. అవి వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. అయినా ఆ కసాయి తల్లి వైఖరిలో మార్పు రాలేదు. తల్లి వేధింపులు తాళలేని బాలిక పోలీసులను ఆశ్రయించింది.(Vizianagaram)

మహిళకు (40) 15ఏళ్ల కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితమే మహిళ భర్త చనిపోయాడు. విశాఖలోని ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుతున్న పెద్ద కూతురు ఇటీవలే ఎండాకాలం సెలవులకు తల్లి దగ్గరికి వచ్చింది. ఇటీవల మహిళ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి బాలికను చూసి ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. మరింత బొద్దుగా మారితే ఆమెకు చాన్సులు వెతుక్కుంటూ వస్తాయన్నాడు.

Also Read..Kavach : కవచ్ ఉన్నా.. ప్రమాదం జరిగేదా? అసలు ఏంటీ కవచ్? రైలు ప్రమాదాలను ఎలా అరికడుతుంది?

దీంతో ఆ మహిళ దిగజారిపోయింది. తన కూతురి శరీర భాగాలు పెద్దవిగా మారేందుకు, కూతురు త్వరగా ఎదిగేందుకు రకరకాల హార్మోన్ ఇంజెక్షన్లు ఇప్పించింది. కానీ, అవి వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. ఇంజెక్షన్లు భరించలేనని వేడుకున్నా కసాయి తల్లి హృదయం కరగలేదు. తల్లి విపరీత చర్యలతో విసిగిపోయిన బాలిక.. చైల్డ్‌హెల్ప్ లైన్ సిబ్బందికి సమాచారం అందించింది. పోలీసుల సాయంతో బాలికను బాలల సంరక్షణాలయానికి తరలించారు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది.(Vizianagaram)

కూతురిని హీరోయిన్ చేయాలని ఆమెకు కన్నతల్లే బలవంతంగా హార్మన్ ఇంజక్షన్లు ఇప్పించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. అసలు నువ్వు తల్లేనా? అని అంతా ఆ మహిళను తిట్టిపోస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.